← Back to news

చిట్టాపూర్ గ్రామాభివృద్ధికి సహకరించాలి

By Prakash· 1d ago· Chittapur, Akberpet-Bhoompally, Siddipet
చిట్టాపూర్ గ్రామాభివృద్ధికి సహకరించాలి

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి నివారణకు బోర్లు మంజూరు చేసి ప్రజల నీటి కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local