సుబ్లేడ్‌లో అన్నదానం

ఖమ్మం జిల్లా సుబ్లేడ్ గ్రామం రైస్ మిల్ సెంటర్ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు జిల్లా కాంగ్రెస్ నేత రామసహాయం నరేష్ రెడ్డి, సర్పంచ్ స్వాతి సుమన్ రెడ్డి గెస్టులుగా వచ్చి అన్నదానాన్ని ప్రారంభించారు. రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.




