← Back to news

82 ఏళ్ల క్రితం ఆంధ్రలో అంబేడ్కర్ తొలి అడుగు!

By Eluri Nani· 2h ago
82 ఏళ్ల క్రితం ఆంధ్రలో అంబేడ్కర్ తొలి అడుగు!

AP: 1944 సెప్టెంబర్ 27న దళిత (SC) పిల్లల చదువులు, హక్కులు పెద్ద సమస్యగా ఉన్న రోజులు అవి. అలాంటి సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ తొలిసారి ఆంధ్రకు వచ్చారు. లేబర్ మినిస్టర్‌గా రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, గుడివాడ, పాలకొల్లు, రామచంద్రాపురం, విశాఖపట్నంలో పర్యటించారు. SC విద్యార్థుల చదువు, సమస్యలపై చర్చించారు. SC ఫెడరేషన్ కార్యకర్తలతో మాట్లాడారు. లేబర్ డిపార్ట్‌మెంట్ పనులను పరిశీలించారు. ఆయన పర్యటనకు నందనార్ హరి కృషి చేశారు.

More in AP

30న విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్
AP· 3h ago

30న విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్

AP: మాజీ MP విజయసాయి రెడ్డి <a href="https://x.com/VSReddy_MP/status/2104181451017314389?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104181451017314389%7Ctwgr%5E124069a54fcc6e322130986b2b15649af866299e%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fandhra-pradesh%2Fvisakhapatnam%2Fvijayasai-reddy-visakhapatnam-press-meet-september-30-vk-1561950.html">'X'లో రాష్ట్ర రాజకీయాలపై</a> హాట్ కామెంట్స్ చేశారు. రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు విశాఖలోని దస్పల్లా హోటల్‌లో జరిగే ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తానని తెలిపారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, తెరవెనుక పొలిటికల్ అలయెన్స్‌లు, గిరిజనులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న మత మార్పిడులపై మాట్లాడతానన్నారు.