← Back to news

ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని ఆర్టీసీ డీఎంకు వినతి

By DK· 18h ago
ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని ఆర్టీసీ డీఎంకు వినతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని RTC బస్సులను రైల్వేస్టేషన్, హౌసింగ్ బోర్డు, మిట్టకండ్రిగ ప్రాంతాల్లో ఆపేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతికి వినతిపత్రం అందజేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులతోపాటు తిరుపతికి వెళ్లే ప్రయాణికులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

More in Local