వెల్గటూర్ ప్రజావాణిలో 2 అర్జీలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి జరిగింది. ఎంపీడీవో పి. వెంకట్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి రెండు రెవెన్యూ దరఖాస్తులు తీసుకున్నారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని ఎంపీడీవో సూచించారు.



