LPG బుకింగ్ రూల్‌లో మార్పు.. ఇక 25 రోజులకే రీఫిల్!

గ్యాస్ సిలిండర్ అయిపోయేలోపు మళ్లీ బుక్ చేసుకోవడానికి ఇక 45 రోజులు ఆగాల్సిన పని లేదు. కేంద్రం కొత్తగా దేశవ్యాప్తంగా LPG రీఫిల్ బుకింగ్ గ్యాప్‌ను 25 రోజులకు తగ్గించింది. ఇప్పటివరకు పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా వేర్వేరు రూల్స్ ఉండేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా 25 రోజులకే తదుపరి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. LPG సప్లై పరిస్థితి మెరుగుపడటం, పెండింగ్ బుకింగ్స్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పు వెంటనే అమల్లోకి వచ్చింది.



