← Back to news

అసెంబ్లీ దగ్గర రచ్చ.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం

By Krishna· 8h ago

TG: అసెంబ్లీ దగ్గర జరిగిన పరిణామాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. తమను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. దీనిపై ప్రతీ జిల్లాలో నిరసనలు తెలపాలని నేతలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఐతే.. నినాదాలు రాసి వున్న నల్ల టీ షర్టులు ధరించారనే కారణంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో హరీశ్‌రావు, కొందరు ఎమ్మెల్యేలు షర్టులు విప్పి, బనియన్లతో నిరసన తెలిపారు.

More in TG