యూట్యూబర్ నందన అరెస్ట్!

ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన (అన్నే రామ నందన)ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె లండన్‌లో ఉద్యోగాలు, వీసా ఇప్పిస్తామని చెప్పి సుమారు 100 మంది దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితులు కంప్లైంట్ చెయ్యడంతో ఆమె, భర్త మధుకర్, అత్తమామలపై కేసు నమోదైంది. లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం.. భారత్ వచ్చిన నందనను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చిరంజీవి ‘మన శంకర్’ సినిమాలో నటించారు.



