← Back to news

ఇల్లందులో పేదల ఇళ్లకు పట్టాలివ్వాలి: CPM డిమాండ్

By Alam· 1d ago· భద్రాద్రి కొత్తగూడెం
ఇల్లందులో పేదల ఇళ్లకు పట్టాలివ్వాలి: CPM డిమాండ్

ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ బస్తీతో పాటు మండలానికి చెందిన సీఎస్పీ బస్తీ, విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ లోని ఇళ్లకు జీవో 76 ప్రకారం రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని CPM జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక ఏలూరి భవన్‌లో జరిగిన భూ పోరాట సభలో ఆయన అతిథిగా వచ్చి మాట్లాడారు. సింగరేణి ప్రాంతాల్లోని ఇళ్లకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం మంచి విషయమన్నారు.

ఇల్లందులో పేదల ఇళ్లకు పట్టాలివ్వాలి: CPM డిమాండ్

More in Local