రాజాంలో ఘనంగా గురజాడ జయంతి
విజయనగరం జిల్లా రాజాంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ కవి, రచయిత వెలుగు రామానాయుడు మాట్లాడారు. "దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్" అన్న గురజాడ స్ఫూర్తి నేటి తరానికి అవసరమని అన్నారు. "కన్యాశుల్కం" నాటకం ద్వారా సమాజ దురాచారాలపై ఆయన పోరాటం మరువలేనిదని కొనియాడారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సాహితీ అభిమానులు, కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య, శాసపు వేణు తదితరులు పాల్గొన్నారు.



