← Back to news

గణనాథుడి నిమజ్జనానికి పోలీసుల పటిష్ట ఏర్పాట్లు

By DK· 8h ago
గణనాథుడి నిమజ్జనానికి పోలీసుల పటిష్ట ఏర్పాట్లు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాందటి వాగు వద్ద గణపతి నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిమజ్జన ప్రదేశాన్ని ఆయన పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగినంత పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

More in Local