మోడీ, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఇబ్రాం శేఖర్

దేశంలో బహుజనులు చైతన్యవంతులవుతుండటంతో ఆధిపత్య రాజకీయ పార్టీలు భయపడి SIR ప్రక్రియను తీసుకొచ్చి బహుజనుల ఓట్లను తొలగిస్తున్నాయని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆరోపించారు. ఈ విషయంలో బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బడంగ్పేట్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహుజన రాజ్యాధికార సమరభేరి సభలో ఆయన మాట్లాడారు.



