పట్టుదలతో చదివి MBBS సీటు సాధించిన అక్షర

TG: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన అక్షర వైద్య విద్యలో సత్తాచాటింది. దానం రఘు–శ్రీలత దంపతుల కుమార్తె అక్షర ఇటీవల వెలువడిన NEET ఫలితాల్లో 488 మార్కులు సాధించి, యాదాద్రి భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు పొందింది. గ్రామీణ ప్రాంతానికి చెందినప్పటికీ పట్టుదలతో చదివి వైద్య విద్యలో ప్రవేశం సాధించడంపై మర్రిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు అక్షరను అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.



