యూట్యూబర్లపై నటి రాధిక ఫైర్!

నటి రాధిక శరత్‌కుమార్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై ఫైర్ అయ్యారు. సినిమాలు, యాక్టర్స్, మహిళలు, వారి ఫ్యామిలీల గురించి కొందరు హద్దులు దాటి కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత ఇలాంటి కామెంట్స్‌పై అడిగేవాళ్లు లేరనే ధైర్యంతో కొందరు ఇలా చేస్తున్నారని అన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలపై కూడా కావాలనే నెగెటివ్ రివ్యూలు స్ప్రెడ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు స్ట్రిక్ట్ సిస్టమ్ అవసరమని రాధిక అన్నారు.



