ఎల్నినో ఎఫెక్ట్.. డ్రిప్ వైపు రైతులు

నిర్మల్ జిల్లాలో ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు డ్రిప్ సేద్యాన్ని చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారిణి సాదుల మౌనిక సూచించారు. పొడి వాతావరణంతో పంటలు దెబ్బతినకుండా నీటిని పొదుపుగా వినియోగించే బిందు సేద్యం ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుని రైతులంతా డ్రిప్ సేద్యం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.


