← Back to news

అల్లీపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

By .· 1d ago· Jagitial
అల్లీపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

TG: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ తంగెళ్ల రమేష్, అధ్యక్షులు వాసం ప్రసాద్, సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ సుధావేణి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అల్లీపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.