తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని మహాధర్నా

ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీచైతన్య స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎమ్మార్పీఎస్ నాయకులతో పాటు ముస్లిం మైనార్టీలు, బీసీలు, ఎస్టీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏడు నెలలుగా న్యాయం కోసం పోరాడిన తౌషిక్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని నాయకులు తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.



