← Back to news

వన్యప్రాణుల రక్షణపై స్టూడెంట్స్‌కు అవగాహన

By DK· 2h ago
వన్యప్రాణుల రక్షణపై స్టూడెంట్స్‌కు అవగాహన

కొమురంభీమ్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని KGBV పాఠశాలలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వ్యాసరచన, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. కర్జెల్లి FRO సుభాష్ సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో FBOలు ఏ. ప్రభాకర్, ఇమ్రాన్ పాల్గొన్నారు. వన్యప్రాణుల ప్రాముఖ్యత, అడవుల పరిరక్షణ అవసరాన్ని విద్యార్థినులకు వివరించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను వ్యాసాలు, డ్రాయింగ్స్ రూపంలో వ్యక్తపరిచారు.

More in Local