← Back to news

మహిళా సమైక్య కార్యాలయంలో కల్టివేటర్ మాయం

By Kamal Kumar· 13h ago· Tandur, Tandur, Vikarabad
మహిళా సమైక్య కార్యాలయంలో కల్టివేటర్ మాయం

వికారాబాద్ జిల్లా తాండూరు మండల మహిళా సమైక్య కార్యాలయంలో మహిళా సంఘాలకు మంజూరైన కల్టివేటర్ మాయమవడం కలకలం రేపుతోంది. చోరీ జరిగినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయ పరిసరాల్లో CCTV కెమెరాలు ఉన్నప్పటికీ, చోరీకి సంబంధించిన ఆధారాలు లేకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local