మిగిలిన అన్నం పారబోయకండి🍚

TG : మందమర్రిలోని 1వ జోన్‌లో జరిగిన ఒక దశదిన కర్మ కార్యక్రమంలో ఆహారం మిగిలిపోయింది. దాన్ని వృథా చేయకుండా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన సొసైటీ సభ్యులు ఆ భోజనాన్ని సేకరించి మందమర్రి బస్టాండ్ దగ్గర ఉన్న నిరుపేదలకు పంచిపెట్టారు. ఎక్కడైనా ఆహారం మిగిలిపోతే తమకు ఫోన్ చేస్తే పేదలకు అందిస్తామని, అన్నాన్ని వృథా చేయవద్దని సొసైటీ అధ్యక్షులు కోరారు.



