ఆ ఊళ్లల్లో రాఖీ పండగ జరుపుకోరు

దేశం అంతటా రక్షాబంధన్ వైభవంగా జరుపుకుంటారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం తరతరాలుగా ఈ పండుగను జరుపుకోవడం లేదు. UPలోని సథా, ధౌలానా ప్రజలు మహారాణా ప్రతాప్ వంశస్తులు. రాఖీ పండుగ రోజునే జరిగిన ఒక యుద్ధంలో వారి పూర్వీకులు ఓడిపోయి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇక్కడ రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారు. రాజస్థాన్‌లోని పాలిలో రాఖీ పండుగ రోజునే పాలివాల్ బ్రాహ్మణులపై మహమ్మద్ ఘోరీ దాడి చేసి దారుణంగా చంపేశాడు. అందుకే ఈ రోజును వారు పండుగగా కాకుండా విషాద దినంగా భావిస్తారు.



