బంగారం కోసం దారుణ హత్య.. ఇద్దరికీ జీవిత ఖైదు

AP: కాకినాడ జిల్లాలో 2023లో జరిగిన పప్పు సత్యవతి హత్య కేసులో పిఠాపురం జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎర్రకోనేరులో సత్యవతిని కత్తులతో దాడిచేసి హత్య చేసిన అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలను నిందితులు దోచుకెళ్లారు. కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ సాహు, ఒడిశాకు చెందిన రాజ్ బిందాసింగ్‌పై నేరం రుజువైంది. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులపై అభియోగాలు నమోదు చేసి, ఆధారాలతో నేరం నిరూపించినట్లు తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపారు.



