సౌరవ్, అశుతోష్ కోసం హైకోర్టుకు వెళ్లిన CJP న్యాయబృందం

CJP నాయకులు సౌరవ్, అశుతోష్లను రిలీజ్ చేయాలని కోరుతూ CJP న్యాయ బృందం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ బారికేడ్లను దాటి లోపలికి వెళ్లారనే ఆరోపణలతో వాళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కోర్టు వాళ్ల కస్టడీని రెండు రోజులు <a href="https://www.theclearcutnews.com/n/f2i5uEf">పొడిగించింది. </a>దీన్ని సవాల్ చేస్తూ CJP లీగల్ హెడ్ రత్నాసింగ్, ఇతర లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా రాత్రిపూట విచారణ జరిపించాలని హైకోర్టును కోరినట్లు పార్టీ తన 'ఎక్స్'లో వెల్లడించింది.


