ఉపాధ్యాయులపై దాడులు దుర్మార్గం: హోం మంత్రి అనిత

హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఉపాధ్యాయులపై దాడులు దుర్మార్గమన్నారు. డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీపై తొలి సంతకం చేసి 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



