జైపాల్ కుటుంబానికి అండగా ఉంటాం: భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఇంద్రనగర్ తండాలో విద్యుత్ షాక్‌కు గురై రైతు జైపాల్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. బుధవారం తండాకు వెళ్లిన ఆయన మృతుని కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం నుంచి మృతుని కుటుంబానికి అందాల్సిన పరిహారం విషయంలో అవసరమైన చర్యలు తీసుకుని పరిహారం అందేలా చూస్తానని భూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.



