← Back to news

గణపతి నవరాత్రుల్లో మద్యం, మాంసాహారానికి దూరం

By DK· 6h ago
గణపతి నవరాత్రుల్లో మద్యం, మాంసాహారానికి దూరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని బేడ బుడగ జంగాల కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి మండపంలో కాలనీ వాసులు ప్రత్యేక ప్రమాణం చేశారు. గణపతి సాక్షిగా తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నియమ నిష్టలతో నిర్వహించడంతో పాటు, గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు కాలనీలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పురోహితులు రేపాక రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

More in Local