← Back to news

ఘనంగా గణేష్ శోభాయాత్ర

By KUCHIPUDI BUJJIBABU· 21h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని సొసైటీ సెంటర్‌లో శ్రీ కృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయకుని నిమజ్జన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు వినాయకుడి లడ్డూలకు బహిరంగ వేలం నిర్వహించగా, 20 కేజీల లడ్డును సుంకర పూర్ణచంద్రరావు రూ.95 వేలకు, 5 కేజీల లడ్డును లింగినేని పవన్ కళ్యాణ్ రూ.45 వేలకు దక్కించుకున్నారు. అనంతరం మేళతాళాలు, బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలు, బాణాసంచా కాల్పుల మధ్య ‘జై గణేష్ మహారాజ్’ నినాదాలతో వినాయకుడి ఊరేగింపు ఉత్సాహంగా సాగింది.

More in Local