← Back to news

నిధుల దుర్వినియోగంపై సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్

By K. RAJASHEKAR KMR· 21 Aug 2026· Machareddy, Machareddy, Kamareddy
నిధుల దుర్వినియోగంపై సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్

TG: కామారెడ్డి జిల్లా ఫరీద్‌పేట్ గ్రామపంచాయతీలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. కలెక్టరేట్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో శానిటేషన్ పనులకు సంబంధం లేని ‘ఓం సాయి ఎలక్ట్రికల్స్’ సంస్థకు రూ.48,670 చెల్లించినట్లు అధికారులు జరిపిన విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసి అధికారులు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.

More in Local