గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రధాన దినపత్రిక జిల్లా స్ట్రింగర్‌గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కే. శ్రీనివాస్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. 30 ఏళ్లుగా వివిధ పత్రికల్లో సర్క్యులేషన్, అడ్వర్టైజ్‌మెంట్, వార్తా సేకరణలో ఆయన ప్రతిభ చాటారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతలు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్రామానికి చెందిన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని జర్నలిస్టు సంఘాలు కోరాయి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు.



