పోలీస్, విద్యుత్, పెన్షన్ సమస్యలపై ఫిర్యాదులు

TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు అందాయి. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి మొత్తం నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పోలీస్, విద్యుత్, పెన్షన్ తదితర సమస్యలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు.



