రాష్ట్రం కోసం దుర్గమ్మను వేడుకున్న :CM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఆరు రోజుల్లోనే 8 లక్షల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారని CM చంద్రబాబు తెలిపారు. భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, దుర్గమ్మ ఆశీస్సులతో భక్తుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరువును ఎదుర్కొనే శక్తిని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.


