William Adam రిపోర్ట్ గురించి తెలుసా?

William Adam అనే స్కాటిష్ మాజీ బాప్టిస్ట్ మిషనరీ 1835–1838లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో స్థానిక విద్యావ్యవస్థపై సర్వే చేశారు. గ్రామీణ స్కూళ్లు, టీచర్లు, స్టూడెంట్స్ సంఖ్య, కులాల వివరాలు సేకరించారు. బుర్ద్వన్ జిల్లాలోనే నిమ్నకులాల నుంచి 760 మంది బడుల్లో చదువుకొంటున్నారని రాశారు. ఇతర జిల్లాల్లోనూ అనేక నిమ్నకులాల పిల్లలు స్కూళ్లలో ఉన్నట్లు వివరించారు. చరిత్రకారులు ఈ విషయాన్ని చెప్తూ నిమ్నకులాలకు ఆ రోజుల్లో బడుల్లో ప్రాతినిధ్యం ఉందని చెబుతారు.



