← Back to news

రోడ్డు లేక ఇబ్బందులు.. రైతుల నిరసన

By Bala· 1d ago

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో రైతులు ఆందోళన చేపట్టారు. నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులను అడ్డుకుని పంట పొలాలకు ట్రాక్టర్లు వెళ్లేలా అంతర్గత రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో డీపీఆర్‌లో సరైన వివరాలు లేక రోడ్డు మంజూరు కాలేదని ఆరోపించారు. వేములతండా–ఎర్రకుంట గట్టు దారిని ట్రాక్టర్ల రాకపోకలకు అనుకూలంగా మార్చాలని కోరారు.

More in Local