← Back to news

తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...

By saraswathi· 4d ago· Razole, Razole, Dr. B.R. Ambedkar Konaseema
తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...

Dr.BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్టణంలో కుళాయిల్లో దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. సుందరమ్మ చేరువుగట్టు ప్రాంతంలో 2 days కి ఒకసారి, 1/2 గంట మాత్రమే నీరు వస్తోంది. అయితే అవి తాగేందుకు పనికిరావు నీటి పైపులైన్లకు, మురుగు కాలువలకు మధ్య లీకేజీలు ఉండటమే కారణం. రిపేర్లు సరిగా చేయకపోవడంతో మురుగు నీరు తాగునీటి లైన్లలోకి కలుస్తోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాలో 30 గ్రామాలకూ తాగునీటి కష్టాలున్నాయి. జిల్లాలో 676 RO ప్లాంట్లు ఉంటే, 302 పనిచేయడం లేదు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.