← Back to news

పాఠశాలల అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

By DK· 5h ago
పాఠశాలల అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

హనుమకొండ జిల్లా పరిధిలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలకు విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, వివిధ ఇంటర్వెన్షన్ల కింద చేపట్టిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటర్వెన్షన్‌కు కేటాయించిన బడ్జెట్‌ను సకాలంలో వినియోగించాలన్నారు.

More in Local