← Back to news

ఘనంగా శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట

By యాకయ్య యాదవ్· 1d ago· Thorrur (Ct), Thorrur, Mahabubabad
ఘనంగా శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న స్వయంభు శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆలయ పూజారి సంతోష్ శర్మ ఆధ్వర్యంలో పండితులు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. తొర్రూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

More in Local