స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌కు ఇదొక శుభదినం: ప్రధాని మోదీ

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. తరువాత జరిగిన బహిరంగ సభలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌కు ఇదొక శుభదినమని అన్నారు. రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. అయన తన ప్రసంగాన్ని "అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో మొదలుపెట్టారు. పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపైకి వచ్చే అదృష్టం తనకు దక్కిందని అన్నారు.


