← Back to news

పోలీసు ఇంట్లోనే భారీ చోరీ

By arjun banu1434· 22 Aug 2026
పోలీసు ఇంట్లోనే భారీ చోరీ

AP: పోలీసు ఉద్యోగి ఇంట్లోనే భారీ చోరీ జరగడం కొత్తపేటలో కలకలం రేపింది. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని ఆర్‌ఎస్‌ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యతో కలిసి వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను ధ్వంసం చేసి సుమారు 28 తులాల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

More in Local