← Back to news

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం..

By gani gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం..

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లిలో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం అదే గ్రామానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వి.ఎన్.వి. పవన్ కుమార్ తెలిపారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.