ఎంజీఎం ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ సత్యశారద, వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డా. వాణి సందర్శించారు. ఆదివారం జరిగిన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు వార్డులు, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలోని సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.



