← Back to news

బెజ్జంకిలో పోషణ మాసం కార్యక్రమం

By Bejjanki· 1d ago· Bejjanki, Bejjanki, Siddipet
బెజ్జంకిలో పోషణ మాసం కార్యక్రమం

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో సెక్టార్ స్థాయిలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ భావనా మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చిన్నతనం నుంచే సమతుల ఆహారం అందిస్తే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల ప్రాథమిక విద్య, ఆటల ఆధారిత అభ్యాసంపై అవగాహన కల్పించారు.

బెజ్జంకిలో పోషణ మాసం కార్యక్రమం
బెజ్జంకిలో పోషణ మాసం కార్యక్రమం

More in Local