← Back to news

లిఫ్ట్ అడిగి.. కత్తితో బెదిరించి దోపిడీ

By dk· 3 Aug 2026· హైదరాబాద్
లిఫ్ట్ అడిగి.. కత్తితో బెదిరించి దోపిడీ

TG: లిఫ్ట్ పేరుతో ద్విచక్ర వాహనదారుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగదు, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దోచుకున్న ఆరుగురు యువకులను ఆల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో జూలై 31న పద్మారావు అనే వ్యక్తి నుంచి లిఫ్ట్ తీసుకున్న ఓ యువకుడు, కొద్దిదూరం వెళ్లిన తర్వాత మరో ఐదుగురితో కలిసి బాధితుడిని బెదిరించి రూ.5వేల నగదుతో పాటు గూగుల్ పే ద్వారా రూ.800 బదిలీ చేయించుకున్నారు. పోలీసులు రాజేంద్రనగర్ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.