← Back to news

లక్ష్మాపూర్ చెరువు రక్షణకు కృత్రిమ నిమజ్జన కొలను

By Madhu· 1d ago· Mooduchintalaphally, Muduchinthalapally, Medchal Malkajgiri
లక్ష్మాపూర్ చెరువు రక్షణకు కృత్రిమ నిమజ్జన కొలను

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. లక్ష్మాపూర్ చెరువులో కర్కపట్ల ఫార్మా-బయోటెక్ వ్యర్థాలు, నిమజ్జనాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నిమజ్జనం చేయకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కృత్రిమ నిమజ్జన కొలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అత్యవసరంగా చెరువులో నిమజ్జనం చేస్తే దండలు, కండువాలు, ప్లాస్టిక్ తొలగించి విగ్రహాలను మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

లక్ష్మాపూర్ చెరువు రక్షణకు కృత్రిమ నిమజ్జన కొలను

More in Local