← Back to news

జలవిహారిలో స్థానికులకే ఉపాధి కల్పించాలి

By Nava surya Mandyaguru· 2h ago· Dumbriguda, Araku Valley, Alluri Sitharama Raju
జలవిహారిలో స్థానికులకే ఉపాధి కల్పించాలి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చాపరాయి జలవిహారిలో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో జాప్యం జరుగుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అభివృద్ధి కమిటీలో గతంలో 10 మంది స్థానికులకు ఉపాధి కల్పించాలని తీర్మానం చేసినప్పటికీ, స్థానికులను పక్కనపెట్టి బయటి వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. డుంబ్రిగుడకు చెందిన మండ్యాగురు అరుణ్‌ మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఉపాధి కోసం ITDA, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

More in Local