← Back to news

సైబర్ నేరాల పోలీసుల అవగాహన

By DK· 1d ago
సైబర్ నేరాల పోలీసుల అవగాహన

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం భారెగూడ గ్రామంలో బెజ్జూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని సూచించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, OTP, ATM PIN ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలన్నారు. దుర్గామాత ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఊరేగింపులు, DJలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు.

More in Local