← Back to news

వరంగల్ MGMకి వెళ్లిన CJPకి బ్రేక్ వేసిన పోలీసులు

By Krishna· 1d ago· Instagram

TG: వరంగల్ MGM హాస్పిటల్‌లో ఆదివారం ఆరోగ్యశ్రీ వార్డులో సీలింగ్ పెచ్చులు ఊడిపడి పక్షవాత రోగి, అటెండర్లు, శానిటేషన్ కార్మికులు సహా దాదాపు ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పాత భవనంలో జరిగిన ఈ ఘటనతో రోగుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన CJP ప్రతినిధులను ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మౌలిక సదుపాయాల్లో నిర్లక్ష్యం ఉందనే విమర్శలొస్తున్నాయి. కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరగా ప్రారంభం కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

More in TG