← Back to news

శంకర తనయుని మండపంలో షేక్ హైమద్ భజన కీర్తనలు

By Digamber· 9h ago· Mudhole, Mudhole, Nirmal
శంకర తనయుని మండపంలో షేక్ హైమద్ భజన కీర్తనలు

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లో మోక్ష కర్ర గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చాక్‌పల్లికి చెందిన షేక్ హైమద్ భజన కీర్తనలు పాడారు. మతం అనేది మనం సృష్టించుకున్నదేనని, దేవుడు అందరికీ సమానమని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు భజనలు పాడటం ఇష్టమని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటే దేశంలో ప్రశాంతత ఉంటుందని చెప్పారు. ఆయన భక్తి గీతాలకు అందరూ మంత్రముగ్ధులయ్యారు.

More in Local