← Back to news

కారులో 129 కిలోల గంజాయి.. ఇద్దరి అరెస్ట్

By MSR PATEL· 26 Aug 2026
కారులో 129 కిలోల గంజాయి.. ఇద్దరి అరెస్ట్

TG: వరంగల్‌లో నార్కోటిక్స్‌ పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. వర్ధన్నపేట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రూ.64.66 లక్షల విలువైన 129 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం 5.50 గంటల సమయంలో ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా, వెనుక భాగంలో అక్రమంగా దాచిన 61 ప్యాకెట్ల గంజాయి గుర్తించారు. అరెస్టయిన వారిని కేరళకు చెందిన సయూజ్‌ సి.ఎస్‌ (33), బెసలేల్‌ సి. మాథ్యూ (38)గా గుర్తించారు.

More in Local