← Back to news

గ్యాస్ కనెక్షన్ అంటూ నమ్మించి.. డబ్బులతో పరార్

By dk· 7 Aug 2026· యాదాద్రిభువనగిరి జిల్లా
గ్యాస్ కనెక్షన్ అంటూ నమ్మించి.. డబ్బులతో పరార్

TG: యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(M) మండలం కొరటికల్‌లో గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ కేటుగాడు మహిళను మోసం చేసి రూ.4,500 కాజేశాడు. మెడలో ఐడీ కార్డు ధరించి గ్యాస్ సంస్థ ప్రతినిధినంటూ ఇంటింటికీ తిరిగిన వ్యక్తి.. ప్రభుత్వ ప్రత్యేక పథకంలో గ్యాస్ కనెక్షన్ మంజూరైందని రాములమ్మను నమ్మించాడు. రూ.4,500 చెల్లిస్తే అదేరోజు కనెక్షన్ ఇస్తానని చెప్పడంతో ఆమె డబ్బులు ఇచ్చింది. అనంతరం ఫోన్ నంబర్ స్విచ్‌ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.