← Back to news

ఆయుధాల చోరీ వెనుక అసలు ప్లాన్ ఏంటి?

By Lokesh· 12h ago
ఆయుధాల చోరీ వెనుక అసలు ప్లాన్ ఏంటి?

TG: హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో మాజీ ఆర్మీ హవల్దార్ మల్లేశ్‌ను పోలీసులు 10 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. 6 గంటల పాటు ప్రశ్నించారు. దొంగిలించిన ఆయుధాలను ఎవరికి ఇవ్వాలని చూశాడు? ఎవరితో మాట్లాడాడు? అనే యాంగిల్లో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తీసేయడం వల్ల కోపంతోనే చోరీ చేశాడా? లేక <a href="https://www.theclearcutnews.com/n/tqwUmnL">ఆయుధాలను</a> అమ్మే ప్రయత్నం చేశాడా అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. మల్లేశ్ ఫోన్ డేటా, సోషల్ మీడియా సెర్చ్ హిస్టరీని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

More in Crime